DMDK: శశికళపై ప్రేమలత పొగడ్తలు.. అన్నాడీఎంకే విస్మయం

DMDK leader Premalatha praised Sasikala
  • జయలలితకు అండగా ఉన్నారు
  • ఎలాంటి ప్రయోజనాలు ఆశించలేదు
  • ఆమె నుంచి లబ్ధిపొందిన వారే ఇప్పుడు దూరం పెడుతున్నారు
  • వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా
శశికళ మంచి వ్యక్తి అంటూ తమిళ నటుడు విజయ్‌కాంత్ సారథ్యంలోని డీఎండీకే కోశాధికారి ప్రేమలత చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అధికార అన్నాడీఎంకే నాయకులు శశికళను విమర్శిస్తున్న వేళ, కూటమి నేత ప్రేమలత చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి.

చెంగల్పట్టు జిల్లా సిక్కరాపురంలో నిన్న ప్రేమలత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు శశికళ జీవితాంతం అండగా ఉన్నారని, ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించని మంచి వ్యక్తి అని ప్రశంసించారు. ఆమె ద్వారా లబ్ధిపొందినవారే ఇప్పుడామెను తిరస్కరిస్తుండడం బాధగా ఉందని ప్రేమలత ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్‌కాత్ అనుమతిస్తే త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీచేస్తానని పేర్కొన్నారు.  

గతంలో శశికళపై విరుచుకుపడిన ప్రేమలత అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించడం చూసి సొంత పార్టీ నాయకులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆమె వ్యాఖ్యల వెనక వ్యూహం ఉందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే తమకు తగినన్ని సీట్లు కేటాయించకుంటే టీటీవీ దినకరన్ సారథ్యంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఎఎంఎ)తో చేతులు కలిపేందుకే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని చెబుతున్నారు.
DMDK
Tamil Nadu
Sasikala
Premalatha
AIADMK

More Telugu News