రైతుల ట్రాక్టర్ల ర్యాలీ ద్వారా విద్వేషాలు రెచ్చగొట్టేందుకు 300 ట్విట్టర్ ఖాతాలు సృష్టించిన పాకిస్థాన్
- వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతుల నిరసనలు
- ట్రాక్టర్లతో ర్యాలీ
- ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పాక్ యత్నం
- పెద్ద సంఖ్యలో ట్విట్టర్ ఖాతాలతో దుష్ప్రచారం
ఈ ఖాతాలన్నీ జనవరి 13 నుంచి 18వ తేదీ మధ్య సృష్టించినట్టు గుర్తించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడమే ఈ ట్విట్టర్ ఖాతాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కేంద్రం తీసుకువచ్చిన జాతీయ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనంటూ రైతుల డిమాండ్ చేస్తుండగా, ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవాలని పాక్ భావిస్తోంది.