అయోధ్య రామమందిరానికి తండ్రి పేరిట భారీ విరాళం ప్రకటించిన సుజనా చౌదరి

24-01-2021 Sun 20:04
  • గత డిసెంబరులో కన్నుమూసిన సుజనా తండ్రి
  • తండ్రి పేరుతో రామమందిరానికి సుజనా రూ.2.2 కోట్ల విరాళం
  • జనవరి 15 నుంచి దేశవ్యాప్తంగా విరాళాల సేకరణ
  • ఇప్పటికే రూ.100 కోట్లు దాటిన విరాళాలు
Sujana Chowdary donates huge amount towards Ayodhya Ram mandir

అయోధ్యలో నిర్మించ తలపెట్టిన రామమందిరానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తన తండ్రి జనార్దనరావు పేరిట భారీ విరాళం ప్రకటించారు. సుజనా రూ.2,02,32,000 మొత్తాన్ని విరాళంగా అందించారు. సుజనా తండ్రి యలమంచిలి జనార్దనరావు గత డిసెంబరులో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

అయోధ్య రామమందిరం నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు జనవరి 15 నుంచి దేశవ్యాప్తంగా విరాళాల సేకరణ షురూ చేసింది. వారం రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా విరాళాలు వసూలయ్యాయి. బాలీవుడ్ నుంచి మొదటిగా అక్షయ్ కుమార్ విరాళం ప్రకటించారు. అయితే ఆయన ఎంత విరాళం ఇచ్చారన్నది వెల్లడి కాలేదు. రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాల నుంచి కూడా అయోధ్య రామమందిర నిర్మాణం కోసం విరాళాలు అందుతున్నాయి.