Road Accident: ఉత్తరాది నదీ జలాల కోసం వెళ్లిన తెలంగాణ దేవాయదాయ శాఖ ఉద్యోగులు గుజరాత్ లో దుర్మరణం
- సూరత్ లో రోడ్డు ప్రమాదం
- శ్రీనివాస్, రమణ అనే ఉద్యోగుల మృతి
- మరికొందరికి గాయాలు
- ఘటనపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దిగ్భ్రాంతి
- మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి'
గుజరాత్ లోని సూరత్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ దేవాదాయ శాఖ ఉద్యోగులు ప్రాణాలు విడిచారు. వారిని శ్రీనివాస్, రమణగా గుర్తించారు. శ్రీనివాస్ అడిక్ మెట్ ఆంజనేయస్వామి ఆలయ ఈవో కాగా, రమణ పాన్ బజార్ వేణుగోపాలస్వామి ఆలయ జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. వీరు మరికొందరు ఉద్యోగులతో కలిసి ఉత్తరాది నదీ జలాల కోసం గుజరాత్ వెళ్లారు.
అయితే వీరు ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. శ్రీనివాస్, రమణ మరణించగా, పూజారి వెంకటేశ్వరశర్మ, సత్యనారాయణ, కేశవరెడ్డి గాయపడ్డారు. వారిని అహ్మదాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీనివాస్, రమణల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.