హీరోయిన్ల కష్టాలు కళ్లారా చూశాను... నటిగా ఆఫర్లు వచ్చినా అందుకే వద్దనుకున్నాను: గాయని సునీత

24-01-2021 Sun 16:06
  • ఇటీవల రామ్ వీరపనేనితో సునీత పెళ్లి
  • ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సునీత
  • కెరీర్ మొదట్లో నటిగా చాన్సులు వచ్చాయని వెల్లడి
  • కానీ తిరస్కరించానని వివరణ
Singer Suneetha on her acting chances

ప్రముఖ గాయని సునీత ఇటీవల కొత్త అధ్యాయంలోకి ప్రవేశించారు. డిజిటల్ మీడియా ప్రముఖుడు, మ్యాంగో మీడియా గ్రూప్ అధినేత రామ్ వీరపనేనిని సునీత వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సునీత తన మనోభావాలను పంచుకున్నారు. గులాబి చిత్రంలో ఈ వేళలో నీవు ఏంచేస్తు ఉంటావో అనే పాట హిట్టయిన తర్వాత తనకు సినిమాల్లో నటించమని ఆఫర్లు వచ్చాయని వెల్లడించారు.

అయితే హీరోయిన్ల కష్టాలను తాను స్వయంగా చూశానని, అందుకే ఆ ఆఫర్లను తిరస్కరించానని వివరించారు. ఎస్వీ కృష్ణారెడ్డి వంటి దర్శకుడు సైతం సినిమాల్లో నటించాలని కోరారని, అయితే కొందరు హీరోయిన్ల జీవితాలను చూసిన తర్వాత నటిగా తనను తాను ఊహించుకోలేకపోయానని తెలిపారు. అందుకే నటన జోలికి వెళ్లలేదని, ఇప్పుడున్న జీవితమే తనకు చాలని అన్నారు.