తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై

24-01-2021 Sun 15:30
  • కుటుంబ సభ్యులతో కలిసి తమిళిసై పుణ్యక్షేత్రాల సందర్శన
  • నిన్న రేణిగుంట చేరుకున్న తెలంగాణ గవర్నర్
  • ఈ ఉదయం తిరుమల వెంకన్న దర్శనం
  • ఆపై తిరుచానూరులో పూజలు
Governor Tamilisai visits Tiruchanuru temple

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఏపీలో పుణ్యక్షేత్రాల సందర్శనతో తరించిపోయారు. ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న తమిళిసై అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి తరలివెళ్లారు. తెలంగాణ గవర్నర్ కు తిరుచానూరు ఆలయ వర్గాలు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికాయి.

అమ్మవారి దర్శనం అనంతరం ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆమె తిరుపతిలో ఎస్వీ వైద్య కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు కూడా హాజరయ్యారు. ఈ సాయంత్రం హైదరాబాద్ తిరిగి వెళతారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా తమిళిసై నిన్న రేణిగుంట చేరుకున్నారు. తొలుత కాణిపాకం వరసిద్ధి వినాయకుడ్ని దర్శించుకుని ఆపై తిరుమల వెళ్లారు.