చిరుతపులి మాంసంతో కూర వండుకుని విందు చేసుకున్నారు!

24-01-2021 Sun 13:35
  • కేరళలో దారుణం
  • పొలంలో ఉచ్చులు ఏర్పాటు చేసిన రైతు
  • ఉచ్చులో చిక్కుకున్న చిరుత
  • స్నేహితులతో కలిసి చిరుతను చంపిన రైతు
Leopard killed and cooked for a feast in Kerala

కేరళలో కొందరు వ్యక్తులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఆరేళ్ల వయసున్న ఓ చిరుతపులిని చంపి దాని మాంసంతో విందు చేసుకున్నారు. ఇడుక్కి జిల్లాకు చెందిన వినోద్ అనే వ్యక్తి తన పొలంలోకి వన్యప్రాణులు ప్రవేశించకుండా పొలం చుట్టూ ఉచ్చులు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఉచ్చుల్లో ఓ చిరుతపులి చిక్కుకుంది. దాన్ని వినోద్, అతని స్నేహితులు చంపి, దాని మాంసంతో కూర వండుకుని తిన్నారు. ఆ పులి బరువు 50 కిలోల వరకు ఉంటుందని అటవీశాఖ అధికారులు అంటున్నారు.

చిరుత మాంసం ఆరగించడమే కాదు, దాని చర్మం, గోళ్లు, పళ్లను కూడా విక్రయించేందుకు సిద్ధమయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు గతంలోనూ అనేక వన్యప్రాణులను వధించినట్టు అధికారులు గుర్తించారు.