ashok babu: అమెరికాలో ట్రంప్.. ఏపీలో సీఎం వైఎస్‌ జగన్..: అశోక్ బాబు

  • స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ప‌ట్ల ప్ర‌భుత్వ తీరుపై విమ‌ర్శ‌లు
  • బుగ్గన రాజేంద్ర ప్ర‌సాద్ కు బ‌హిరంగ లేఖ  
  • ఎన్నికల కమిషన్‌కు సహాయ నిరాకరణ చేయడం రాజ్యాంగ విరుద్ధం
  • వీడియో కాన్ఫరెన్స్‌లకు గైర్హాజరు కావడం స‌రికాదు
ashok babu slams jagan buggana

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సీఎం వైఎస్‌ జగన్ రాజ్యాంగేతర శక్తులుగా నిలిచారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ప‌ట్ల ప్ర‌భుత్వ తీరు, ఉద్యోగ సంఘాల అభ్యంత‌రాల‌ను విమ‌ర్శిస్తూ ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్ర ప్ర‌సాద్ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ మంత్రికి బ‌హిరంగ లేఖ రాశారు.

ఎన్నిక‌ల సంఘాన్ని విమర్శించడం రాజ్యాంగ వ్యతిరేకమ‌ని  గతంలో బుగ్గన అన్నార‌ని తెలిపారు. మ‌రిప్పుడు రాష్ట్రంలో ఎన్నికల సంఘంపై ఎందుకు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. మేధావిగా చెప్పుకునే బుగ్గ‌న ఈ విష‌యంపై ఏం చేస్తున్నారని ఆయ‌న నిల‌దీశారు.

ఎన్నికల కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆయ‌న అన్నారు. ఎన్నిక క‌మిష‌న్ నిర్వ‌హించే వీడియో కాన్ఫరెన్స్‌లకు గైర్హాజరు కావడం స‌రికాద‌ని చెప్పారు. ఎన్నికల నిర్వహణపై పూర్తి అధికారాలు ఎన్నికల సంఘానికే ఉంటాయ‌ని తెలిపారు. ఎన్నికల సంఘం పట్ల వైసీపీ స‌ర్కారు మూర్ఖంగా వ్యవహరిస్తోందని, కోర్టుల‌ ఆదేశాలను కూడా ప్రభుత్వం అమలు చేయదా? అని నిల‌దీశారు.  

పాలనపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నందుకే జ‌గ‌న్ స్థానిక సంస్థ‌ల‌ ఎన్నికలంటే  భయపడుతున్నారని ఆయ‌న విమ‌ర్శించారు.ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం లేకుండా జ‌గ‌న్ చేస్తున్నార‌ని, ఆయ‌న‌కు ప్ర‌జ‌లు బుద్ధి చెబుతార‌ని చెప్పారు.

More Telugu News