నా కూతురితో ఇప్పుడు మాట‌లు త‌గ్గాయి: నాగ‌బాబు

24-01-2021 Sun 11:41
  • ఇటీవ‌లే  పెళ్లి జ‌రిగింది
  • ఇంత‌కు ముందూ బాగా మాట్లాడుకునేవాళ్లం
  • ప్ర‌తిరోజు అన్ని విష‌యాల‌పై మాట్లాడేవాడిని
  • ఆమె నా‌ బెస్ట్‌ ఫ్రెండ్  
not able to talk with her frequently nagababu

మెగా బ్రదర్‌ నాగబాబు ఇటీవ‌లే త‌న కూతురు నిహారిక పెళ్లి వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఇన్నాళ్లు త‌న కూతురితో ప్ర‌తిరోజు అన్ని విష‌యాల‌పై మాట్లాడే నాగ‌బాబు.. ఆమె పెళ్లి జ‌రిగిన త‌ర్వాత మాత్రం అంత‌గా మాట్లాడ‌లేక‌పోతున్నార‌ట‌. ఈ విష‌యాన్ని  ఓ ఇంటర్వ్యూలో ఆయ‌న చెప్పారు. నిహారికకు జ‌రిగిన‌ పెళ్లితో పాటు వ‌రుణ్ తేజ్ కు పెళ్లి చేయాల్సిన అంశంపై కూడా ఆయ‌న స్పందించారు.

త‌న‌కు ఆడపిల్లలంటే చాలా ఇష్టమ‌ని, ఈ సృష్టికి మూలం వారేన‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలోనే వారిపై త‌నకు గౌరవం ఎక్కువ‌ని చెప్పారు. వరుణ్ జ‌న్మించిన అనంత‌రం త‌న‌కు ఒక కూతురు పుడితే బాగుండని అనుకున్నానని, కోరుకున్న‌ట్లే త‌మ‌కు నిహారిక జన్మించిందని చెప్పారు.

ఆమె అంటే త‌నకెంతో ఇష్టమ‌ని తెలిపారు. ఆమె త‌న‌ బెస్ట్‌ ఫ్రెండ్ అని అన్నారు. త‌న‌కు సంబంధించిన చాలా విషయాలను ఆమెతో చెప్పేవాడిన‌ని తెలిపారు. తామిద్ద‌రి మధ్య ఉన్న అనుబంధాన్ని చెప్ప‌డానికి మాట‌లు కూడా స‌రిపోవ‌ని అన్నారు.  

అయితే, ఆమె పెళ్లి అయ్యాక మాటలు కొంచెం తగ్గాయని బాధ‌ప‌డ్డారు. అయినా, త‌న కూతురు కొత్త జీవితంలోకి అడుగు పెట్టినందుకు సంతోషంగా ఉంద‌న్నారు. త‌న కూతురు ఎక్కువగా అల్లరి చేస్తుంటుందని, త‌న కుమారుడు చేయ‌డ‌ని చెప్పారు.

వ‌రుణ్ కొంతమంది స్నేహితుల వ‌ద్ద మాత్ర‌మే ఓపెన్‌గా ఉంటాడని తెలిపారు. అత‌డు జ‌నాల్లోకి వెళితే చాలా సైలెంట్‌గా ఉంటాడ‌ని అన్నారు. వరుణ్ ప్రేమ పెళ్లి చేసుకున్నా, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నా అర్థం చేసుకునే మంచి భార్య‌ రావాలని కోరుకుంటున్నానని ఆయ‌న అన్నారు.