ఢిల్లీలో పాకిస్థాన్ అనుకూల నినాదాల క‌ల‌క‌లం

24-01-2021 Sun 11:01
  • ఖాన్ మార్కెట్ మెట్రో వ‌ద్ద ఘ‌ట‌న‌
  • బైక్ రేసింగ్ స‌మ‌యంలో నినాదాలు
  • ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు 
Pakistan Zindabad slogan raised in Delhis Khan Market

ఢిల్లీలో పాకిస్థాన్ అనుకూల నినాదాల క‌ల‌క‌లం చెల‌రేగింది. ఖాన్ మార్కెట్ మెట్రో వ‌ద్ద పాకిస్థాన్ జిందాబాద్ అంటూ ఐదుగురు యువ‌తీయువ‌కులు రెచ్చిపోయారు. వెంట‌నే ఈ విష‌యాన్ని గుర్తించిన పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని పాక్ అనుకూల నినాదాలు చేసిన ఐదుగురిని అరెస్టు చేశారు. పాక్ అనుకూల నినాదాలు చేయ‌డం ప‌ట్ల వారిని పోలీసులు ప్ర‌శ్నిస్తున్నారు.

నిన్న అర్ధ రాత్రి ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని, యువ‌త బైక్ రేసింగ్ కు పాల్ప‌డుతోన్న స‌మ‌యంలో ఈ నినాదాలు వినిపించాయ‌ని పోలీసులు చెబుతున్నారు. బైక్ రేసింగ్ చేస్తోన్న స‌మ‌యంలో ఒక్కో బైక‌ర్ ఒక్కో దేశం పేరు పెట్టుకున్నార‌ని, వారిని అక్క‌డుకున్న వారు ఆ దేశం పేరుతో పిలిచార‌ని పోలీసులు అంటున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది.