తండ్రికి అనుకోని సర్ ప్రయిజ్ ఇచ్చిన మంచు లక్ష్మి!

24-01-2021 Sun 07:36
  • మాల్దీవుల్లో పర్యటనకు వెళ్లిన మోహన్ బాబు
  • బీచ్ లో విందు ఏర్పాటు చేసిన లక్ష్మి
  • ఇష్టమైన భోజనం తిని ఆనందించామని వెల్లడి
Manchu Lakshmi Surprise to his Father

నిత్యమూ సినిమా షూటింగ్ లు, ఇతర వ్యాపార కార్యకలాపాల్లో నిమగ్నమై ఉండే మంచు వారి కుటుంబం, ఇటీవల మాల్దీవుల్లో సేదదీరేందుకు వెళ్లిన వేళ, తన తండ్రి మోహన్ బాబుకు, మంచు లక్ష్మి సర్ ప్రయిజ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను ఆమె, తన సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా, అవిప్పుడు వైరల్ అయ్యాయి.

"నిన్న రాత్రి బీచ్ లో విందు ఏర్పాటు చేసి, నాన్నను ఆశ్చర్య పరిచాను. ఈ విందులో అందరమూ భాగమయ్యాం. నాన్న నటించిన సినిమాల్లోని పాటలను వింటూ, సముద్రపు అందాలను చూస్తూ, మాకు ఇష్టమైన భోజనాన్ని స్వీకరించాం. ఇలా మాకోసం మేము కొంత సమయాన్ని గడిపి చాలా రోజులే అయింది. దీంతో ఈ టూర్ నాకెంతో ప్రత్యేకంగా నిలిచింది" అని ఆమె వ్యాఖ్యానించారు.

కాగా, ప్రస్తుతం మోహన్ బాబు 'సన్ ఆఫ్ ఇండియా' అనే సినిమాలో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ గత సంవత్సరం మొదలైంది. మంచు లక్ష్మి ప్రస్తుతం 'పిట్టకథలు' పేరిట వస్తున్న ఓ సిరీస్ లో నటిస్తున్నారు. ఇది హిందీలో విజయవంతమైన 'లస్ట్ స్టోరీస్'కు తెలుగు రీమేక్ గా వస్తోంది. ఈ సిరీస్ అతి త్వరలోనే నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ పై ప్రజల ముందుకు రానుంది.