దావూద్ కంపెనీ వెనుక అసలు కథ ఇదేనంటూ... 'డీ కంపెనీ' టీజర్ ను విడుదల చేసిన రాంగోపాల్ వర్మ!

24-01-2021 Sun 07:04
  • 1980లో ముంబైలో జరిగిన ఘటనల ఆధారంగా సినిమా
  • నెట్టింట వైరల్ అవుతున్న మూవీ టీజర్
  • ఇప్పటికే దాదాపు 17 లక్షల వ్యూస్
D Company Teaser Released

తన చుట్టూ జరిగే ప్రపంచంలోని వాస్తవాలను సినిమాలుగా తెరకెక్కించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఈ సారి ముంబై మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను తన చిత్రానికి ఇతివృత్తంగా ఎంచుకున్నారు. 'డీ కంపెనీ' పేరిట ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసిన ఆయన, దాని టీజర్ ను యూ ట్యూబ్ లో విడుదల చేశారు.

1980లో ముంబైలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. ముంబై సామూహిక హత్యలు, దావూద్ గ్యాంగ్ సాగించిన దుర్మార్గాలను ఈ టీజర్ లో ప్రస్తావించారు. నిన్న విడుదలైన ఈ టీజర్ నెట్టింట దూసుకెళుతోంది. ఇప్పటికే దాదాపు 17 లక్షల వ్యూస్ ను తెచ్చుకోవడం గమనార్హం. ఈ టీజర్ ను మీరూ చూడవచ్చు.