అఖిలప్రియకు ఫోన్ చేసిన చంద్రబాబు నాయుడు!

24-01-2021 Sun 06:46
  • నిన్న జైలు నుంచి విడుదల అయిన అఖిలప్రియ
  • పరామర్శించిన చంద్రబాబు నాయుడు
  • ధైర్యంగా ఉండాలని సూచన
Chandrababu Called Akhilapriya on Phone

హైదరాబాద్ లో జరిగిన కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయి, దాదాపు రెండు వారాలకు పైగా చంచల్ గూడ జైలులో గడిపి, నిన్న బెయిల్ పై విడుదలైన మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు అఖిలప్రియకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. ఈ సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించిన ఆయన, ఎన్ని కష్టాలు ఎదురైనా మనో నిబ్బరంతో ముందుకు సాగాలని సూచించారు. ఇదే సమయంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని అన్నారు.

కాగా, ఇద్దరు వ్యక్తుల షూరిటీ, రూ. 10 వేల పూచీకత్తుపై ఆమెకు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. ఆమెకు స్వాగతం పలికేందుకు ఆళ్లగడ్డ నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు, అనుచరులు రాగా, చంచల్ గూడ జైలు వద్ద సందడి వాతావరణం కనిపించింది.