తిరుమలలో పెరిగిన రద్దీ!
- వారాంతం కావడంతో రద్దీ
- నిన్న దాదాపు 47 వేల మందికి దర్శనం
- కొండపై వేచి చూస్తున్న 25 వేల మంది
కల్యాణోత్సవం చేయించుకున్న భక్తులు, తదుపరి నెల రోజుల వ్యవధిలో ఎప్పుడైనా స్వామి దర్శనానికి వెళ్లవచ్చన్న సంగతి తెలిసిందే. కాగా, శనివారం నాడు హుండీ ఆదాయం సుమారు రూ. 2 కోట్ల 34 లక్షలుగా ఉందని, రథ సప్తమి పర్వదినానికి ఏర్పాట్లు సాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఆదివారం ఉదయం దాదాపు 25 వేల మందికి పైగా భక్తులు స్వామి దర్శనం కోసం తిరుమలలో ఉన్నారని అంచనా.