నిలకడగా  శశికళ ఆరోగ్యం... తాజా బులెటిన్ విడుదల

23-01-2021 Sat 22:08
  • అనారోగ్యంతో ఆసుపత్రిపాలైన శశికళ
  • బెంగళూరు విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స
  • ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు
  • నోటి ద్వారా ఆహారం తీసుకుంటున్నారని వెల్లడి
Sasikala health is stable as per latest health bulletin

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయ లలిత నెచ్చెలి శశికళ ఆరోగ్య పరిస్థితిపై బెంగళూరు విక్టోరియా ఆసుపత్రి వైద్యులు తాజా బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆ బులెటిన్ లో వెల్లడించారు. చికిత్సకు సౌకర్యవంతంగానే స్పందిస్తున్నారని, నోటి ద్వారా సాధారణ రీతిలో ఆహారం తీసుకుంటున్నారని వివరించారు. ప్రస్తుతం ఆమె స్పృహలోనే ఉన్నారని, విషమ పరిస్థితిని అధిగమించారని తెలిపారు. అయితే, ఇప్పటికీ ఆమెకు ఐసీయూలో నిపుణుల పర్యవేక్షణలోనే చికిత్స కొనసాగుతోందని ఆ బులెటిన్ లో పేర్కొన్నారు.