నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్ కు డుమ్మాకొట్టిన సీఎస్, డీజీపీ, పంచాయతీరాజ్ అధికారులు!

23-01-2021 Sat 16:35
  • పంచాయతీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ జారీ
  • వీడియో కాన్ఫరెన్స్ కు ఏర్పాట్లు చేసిన నిమ్మగడ్డ
  • హాజరు కాని ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు
  • సీఎస్, డీజీపీల కోసం వేచిచూసిన ఎన్నికల సంఘం అధికారులు
State government officials skips SEC video conference

ఏపీలో ఎస్ఈసీ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా తయారైంది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈ మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్ కు సీఎస్ ఆదిత్యనాథ్, డీజీపీ గౌతమ్ సవాంగ్, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు గైర్హాజరయ్యారు. సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరవుతారని నిమ్మగడ్డతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు వేచి చూసినా ఫలితం లేకపోయింది.

ఈ నేపథ్యంలో, తమకు ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు సహకరించడంలేదని ఎస్ఈసీ గవర్నర్ కు ఫిర్యాదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు, ఇప్పటికిప్పుడు పంచాయతీ ఎన్నికలు పెడితే ఎన్నికల సంఘానికి సహకరించేది లేదని ప్రభుత్వ ఉద్యోగులు బహిష్కరాణాస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే.