కోల్ కతా చేరుకున్న మోదీ... నేతాజీకి నివాళి

23-01-2021 Sat 16:21
  • నేతాజీ 124 వ జయంతి సందర్భంగా కోల్ కతాకు వచ్చిన మోదీ
  • నేతాజీ మ్యూజియంను ప్రారంభించిన ప్రధాని
  • ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న మోదీ పర్యటన
PM Modi inaugurates Netaji musium In Kolkata

ప్రధాని మోదీ కాసేపటి క్రితం కోల్ కతాకు చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా నేతాజీ భవన్ కు చేరుకున్న ఆయన... నేతాజీకి నివాళి అర్పించారు. నేతాజీ మ్యూజియంను ప్రారంభించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 124వ జయంతి సందర్భంగా ఆయన బెంగాల్ పర్యటనకు విచ్చేశారు.

మరోవైపు, కోల్ కతాకు వస్తున్న క్రమంలో మార్గమధ్యంలో ఆయన అసోంలో ఆగారు. అసోంకు కూడా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. అసోంలోని స్థానికులకు ఆయన భూమి కేటాయింపుల పత్రాలను అందజేశారు. మరోవైపు బెంగాల్ ఇప్పటికే ఎన్నికల ప్రచారంతో హోరెత్తుతోంది. బీజేపీ, టీఎంసీ పార్టీలు పోటీలు పడి ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఎన్నికల వేళ మోదీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.