సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి భేటీ

23-01-2021 Sat 16:08
  • ట్విట్టర్ లో వెల్లడించిన విష్ణువర్ధన్ రెడ్డి
  • భేటీ అద్భుతంగా సాగిందని వెల్లడి
  • రాజకీయ అంశాలపై చర్చించామని వివరణ
  • ఆసక్తికరంగా మారిన భేటీ
AP BJP General Secretary Vishnuvardhan Reddy met VV Lakshminarayana

ఏపీ రాజకీయాల్లో ఇవాళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవలే జనసేన పార్టీ నుంచి వైదొలగిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి భేటీ అయ్యారు. దీనిపై విష్ణువర్ధన్ రెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. తమ భేటీలో ఏపీ రాజకీయ పరిణామాలపై చర్చించామని వెల్లడించారు. ఈ సమావేశం ఎంతో అద్భుతంగా సాగిందని భావిస్తున్నామని తెలిపారు. ఈ భేటీలో బీజేపీ నేతలు చంద్రమౌళి, బ్రహ్మానందం, ప్రభాకర్ రెడ్డి, రామస్వామి తదితరులు కూడా పాల్గొన్నారని విష్ణువర్ధన్ రెడ్డి వివరించారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను కూడా ఆయన పంచుకున్నారు. కాగా, లక్ష్మీనారాయణ జనసేన నుంచి తప్పుకున్న తర్వాత ఏ పార్టీలో చేరలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలతో భేటీ ఆసక్తి కలిగిస్తోంది.