ఎంపీ అరవింద్ పాల్గొన్న సమావేశం రసాభాస... హామీలపై నిలదీసిన పసుపు రైతులు

23-01-2021 Sat 15:34
  • చౌటుపల్లిలో ఎంపీ అరవింద్ సమావేశం
  • ఎంపీ ప్రసంగానికి అడ్డు తగిలిన రైతులు
  • పసుపు బోర్డు హామీ నెరవేర్చలేదని ఆగ్రహం
  • హామీలు ఇచ్చిన వీడియోలను చూపిన రైతులు
Turmeric farmers questions BJP MP Arvind

బీజేపీ యువ ఎంపీ ధర్మపురి అరవింద్ కు ఇవాళ చేదు అనుభవం ఎదురైంది. నిజామాబాద్ జిల్లా చౌటుపల్లిలో అరవింద్ ఓ సమావేశానికి హాజరు కాగా, పసుపు రైతులు ఆయనను నిలదీశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు, ఎన్నికల సమయంలో అరవింద్ హామీలు ఇచ్చిన వీడియోలను కూడా రైతులు ఈ సందర్భంగా చూపించారు.

 నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని మాట తప్పారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అరవింద్ ప్రసంగానికి రైతులు అడ్డుతగిలారు.
అంతకుముందు, బాల్కొండ పసుపు రైతులు కూడా అరవింద్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పసుపు బోర్డు కంటే ప్రాంతీయ కార్యాలయం ఉపయోగకరమైనదని అరవింద్ చెబుతున్నారని, ఇప్పుడాయన  రాజీనామా చేసి అదే మాటతో ఎన్నికలకు వెళ్లి గెలవాలని రైతులు స్పష్టం చేశారు.