సోదరుడ్ని కోల్పోయిన చెవిరెడ్డికి సీఎం జగన్ పరామర్శ

23-01-2021 Sat 15:04
  • అనారోగ్యంతో చెవిరెడ్డి సోదరుడు కన్నుమూత
  • తుమ్మలగుంటలో నిన్న అంత్యక్రియలు
  • చెవిరెడ్డికి ఫోన్ చేసిన సీఎం జగన్
  • ప్రగాఢ సానుభూతి తెలిపిన వైనం
CM Jagan talks to Chevireddy Bhaskar Reddy

వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట రెండ్రోజుల కిందట విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు చెవిరెడ్డి హనుమంతరెడ్డి (45) అనారోగ్యంతో కన్నుమూశారు. దాంతో చెవిరెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సీఎం జగన్ ఫోన్ చేశారు. ఎంతో బాధలో ఉన్న పార్టీ సహచరుడ్ని ఓదార్చారు. హనుమంతరెడ్డి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

కాగా, హనుమంతరెడ్డి అంత్యక్రియలు నిన్న చిత్తూరు జిల్లా తుమ్మలగుంటలో జరిగాయి. ఆయన భౌతికకాయానికి ఏపీ డిప్యూటీ సీఎం, చిత్తూరు జిల్లా వైసీపీ ముఖ్యనేత నారాయణస్వామి, ఎమ్మెల్యేలు భూమన, బియ్యపు మధుసూదన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు నివాళులు అర్పించారు.