'నాట్యం' సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేసిన ఉపాస‌న‌

23-01-2021 Sat 13:13
  • కూచిపూడి డాన్సర్ సంధ్యా రాజు న‌టిస్తోన్న‌ తొలి సినిమా
  • తన స్నేహితురాలి సినిమా ఫ‌స్ట్‌లుక్ అని తెలిపిన ఉపాస‌న
  • ఈ సినిమా టైటిల్ త‌న‌కు బాగా నచ్చిందని  ట్వీట్
natyam movie first look releases

తన స్నేహితురాలు, కూచిపూడి డాన్సర్ సంధ్యా రాజు న‌టిస్తోన్న‌ తొలి సినిమా నాట్యం ఫ‌స్ట్‌లుక్‌ను హీరో రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న విడుద‌ల చేశారు. ఈ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెడుతున్న త‌న‌ స్నేహితురాలు సంధ్యా రాజును ప్రేక్ష‌కులకు పరిచయం చేస్తున్నాన‌ని చెప్పింది.

ఈ సినిమా టైటిల్ త‌న‌కు బాగా నచ్చిందని  ఉపాసన ట్వీట్ చేశారు. ఈ లుక్‌లో సంధ్యా రాజు నాట్యం చేస్తూ క‌న‌ప‌డుతోంది. ఈ సినిమాకు రేవంత్ కోరుకొండ దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో కమల్ కామరాజు, రోహిత్ బెహల్ కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.