మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లిన బిగ్‌బాస్ ఫేం సోహెల్... ఫొటోలు వైర‌ల్

23-01-2021 Sat 11:16
  • తనను ప్రోత్సహించినందుకు చిరంజీవికి థ్యాంక్స్
  • ఇటీవ‌ల నాగార్జుననూ క‌లిసిన సోహెల్
  • చిరంజీవి భార్య,‌ తల్లితోనూ సోహెల్ ఫొటోలు  
sohel goes chiru home

మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లిన బిగ్‌బాస్ ఫేం సోహెల్ ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను క‌లిసి వారితో ఫొటోలు దిగాడు. తనను ప్రోత్సహించినందుకు చిరంజీవికి ఆయ‌న థ్యాంక్స్ చెప్పాడు. ఇటీవ‌ల నాగార్జునను కూడా సోహెల్ క‌లిశాడు. బిగ్‌బాస్‌కు వ్యాఖ్యాత‌గా నాగార్జున వ్య‌వ‌హ‌రించ‌గా, తుది రోజు బ‌హుమ‌తి ఇవ్వ‌డానికి చిరంజీవి వ‌చ్చిన విష‌యం తెలిసిందే.  
     
సోహెల్‌కు చిరంజీవి త‌న భార్య సురేఖ‌తో బిర్యానీ వండించి మ‌రీ తీసుకొచ్చి ఇచ్చారు. అంతేగాక‌, త‌న ప్రైజ్ మ‌నీ అనాథాశ్రమానికి ఇస్తాన‌ని చెప్పిన సోహెల్ తో ఆ సాయం తాను చేస్తానని చిరు ప్రకటించారు. సోహెల్ న‌టిస్తున్న‌ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా అతిథిగా వ‌స్తాన‌ని బిగ్‌బాస్ ఫైనల్‌లో చిరంజీవి తెలిపారు. ఈ నేప‌థ్యంలోనే చిరు ఇంటికి సోహెల్ వ‌చ్చాడు. చిరంజీవి భార్య సురేఖతో పాటు ఆయ‌న‌ తల్లి అంజనాదేవితోనూ సోహెల్ ఫొటోలు దిగాడు.