విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు: లోకేశ్‌

23-01-2021 Sat 11:01
  • విద్యార్థి లోకం తిరగబడుతుంది
  • నువ్వు తాడేపల్లి కోట నుండి బయటకు అడుగుపెట్టలేవు
  • ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేశారు
lokesh slams jagan

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌భుత్వం తీసుకొచ్చిన జీవో 77ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపితే, విద్యార్థి సంఘాల‌ నాయకులపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేస్తున్నార‌ని ఆయ‌న విమర్శించారు.

'విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు.  విద్యార్థి లోకం తిరగబడితే నువ్వు తాడేపల్లి కోట నుండి బయటకు అడుగుపెట్టలేవు. ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేశారు' అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

'ఇప్పుడు ఏకంగా ప్రైవేట్ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని రద్దు చేస్తూ జీవో 77 తీసుకొచ్చారు. విద్యార్థుల భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేస్తున్న జీవో 77ని రద్దు చెయ్యమని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపితే  నాయకులపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చెయ్యడం దుర్మార్గపు చర్య. అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకొని, జీఓ77 ని రద్దు చెయ్యాలి. ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని పునరుద్ధరించాలి' అని ఆయ‌న అన్నారు.