శివ కార్తికేయన్ తో ఒక డీల్ కుదుర్చుకున్నా: రకుల్ ప్రీత్ సింగ్

23-01-2021 Sat 11:00
  • కరోనా తర్వాత దూకుడు పెంచిన రకుల్
  • 'అయలాన్'లో శివకార్తికేయన్ తో కలిసి నటించిన పంజాబీ భామ
  • కార్తికేయన్ తో కలిసి నటించడం సంతోషాన్నిచ్చిందని వ్యాఖ్య
I have a deal with Siva Karthikayan says Rakul Preet Singh

కరోనా నుంచి కోలుకున్న తర్వాత పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్ దూకుడు పెంచింది. రెగ్యులర్ గా షూటింగ్ లకు హాజరవుతోంది. తాజాగా తమిళంలో 'అయలాన్' సినిమా షూటింగ్ ను పూర్తి చేసింది. ఈ చిత్రంలో శివ కార్తికేయన్ హీరోగా నటించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శివకార్తికేయన్ పై రకుల్ ప్రశంసలు కురిపించింది.

కార్తికేయన్ తో కలసి నటించడం సంతోషాన్నిచ్చిందని చెప్పింది. ఆయన చాలా మంచి యాక్టర్ అని కితాబునిచ్చింది. డైలాగ్స్ ను తమిళంలో ఎలా పలకాలో తనకు నేర్పించాడని చెప్పింది. తనకు కావాల్సిన ఆహారం చెన్నైలో ఎక్కడ దొరుకుతుందో చెప్పేవాడని తెలిపింది. షూటింగ్ సమయంలో ఆయనతో ఒక డీల్ కుదుర్చుకున్నానని... సెట్స్ లో ఉన్నంత కాలం తనతో ఆయన ఇంగ్లిష్ లో మాట్లాడాలి... ఆయనతో తాను తమిళంలో మాట్లాడాలనేదే ఆ డీల్ అని చెప్పింది. ప్రస్తుతం రకుల్ చేతిలో 7 సినిమాలు ఉన్నాయి.