సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

23-01-2021 Sat 07:30
  • గుర్రపుస్వారీ చేస్తున్న సమంత 
  • తమిళ దర్శకుడితో రామ్ ప్రాజక్ట్
  • నితిన్ 'చెక్' రిలీజ్ డేట్ నిర్ణయం
  • మళ్లీ హీరోగా వస్తున్న రోహిత్  
Samanta learning horse riding for her next movie

*  అందాల కథానాయిక సమంత ఇప్పుడు గుర్రపుస్వారీ నేర్చుకోవడానికి రెడీ అవుతోంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందే 'శాకుంతలం' చిత్రంలో సమంత శకుంతలగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర పోషణ కోసమే ఆమె గుర్రపు స్వారీ నేర్చుకుంటోంది.
*  సంక్రాంతికి 'రెడ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎనర్జిటిక్ హీరో రామ్ తన తదుపరి చిత్రాన్ని తమిళ దర్శకుడితో చేయనున్నాడు. గతంలో విజయ్ తో 'జిల్లా' చిత్రాన్ని రూపొందించిన ఆర్.టి. నీసన్ తో రామ్ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది.  ప్రస్తుతం ఈ విషయంపై నీసన్ తో చర్చలు జరుగుతున్నాయట.
*  ప్రస్తుతం హీరో నితిన్ తన తాజా చిత్రాన్ని చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చేస్తున్నాడు. 'చెక్' పేరిట రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తికావస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని వచ్చే నెల 19న రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందులో రకుల్, ప్రియా ప్రకాశ్ వరియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
*  గతంలో '6 టీన్స్', 'జానకి వెడ్స్ శ్రీరామ్' వంటి సినిమాలలో నటించిన హీరో రోహిత్ కొంత గ్యాప్ తర్వాత మళ్లీ హీరోగా నటిస్తున్నాడు. శ్రీను బందెల దర్శకత్వంలో రూపొందుతున్న 'కళాకార్' చిత్రంలో రోహిత్ నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయింది.