Narendra Modi: 1938లో నేతాజీ నడిచిన రోడ్డుపై ఇప్పుడు నన్ను ఊరేగించారు: ప్రధాని మోదీ

  • జనవరి 23న నేతాజీ జయంతి
  • ఒకరోజు ముందే నివాళులు అర్పించిన ప్రధాని మోదీ
  • హరిపురలో మోదీని ఊరేగించిన ప్రజలు
  • నేతాజీని స్మరించుకున్న ప్రధాని
Modi visits Haripura ahead of Subhash Chandrabose birth anniversary

జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఒకరోజు ముందుగానే ఆ మహనీయుడికి నివాళులు అర్పించారు. గుజరాత్ లోని హరిపురలో నేతాజీ విగ్రహానికి అంజలి ఘటించారు. అనంతరం ట్విట్టర్ లో స్పందిస్తూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హరిపుర ప్రజల ఆప్యాయతను ఎప్పటికీ మర్చిపోలేనని, 1938లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నడిచిన రోడ్డుపై ఇప్పుడు తనను ఊరేగించారని పేర్కొంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

నేతాజీకి హరిపుర ఎప్పుడూ ప్రత్యేకమేనని, 1938లో జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లోనే ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని, ఆయన సేవలకు గుర్తుగా ఘనంగా నివాళులు అర్పించేందుకు హరిపుర సిద్ధంగా ఉందని తెలిపారు. మనమందరం గర్వించేలా భారతదేశాన్ని మార్చేందుకు నేతాజీ ఆలోచనలు, ఆదర్శాలు మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు.

2009 జనవరి 23న నేతాజీ జయంతి రోజునే హరిపురలో ఈ-గ్రామ్ విశ్వగ్రామ్ ప్రాజెక్టును ప్రారంభించామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుతో ఐటీ మౌలిక వసతులు సహా సాంకేతిక ఫలాలు గుజరాత్ లోని పేదలకు అందుబాటులోకి వచ్చాయని, మారుమూల గ్రామాల రూపురేఖల్లోనూ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయని మోదీ వివరించారు.

More Telugu News