Udhav Thackeray: 'సీరం' అగ్నిప్రమాదంపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించాం... ప్రమాదమా? లేక కుట్రా? అనేది దర్యాప్తులో తేలుతుంది: సీఎం ఉద్ధవ్ థాకరే

CM Udhav Thackeray press meet along with SII CEO Adar Poonawala
  • సీరం సంస్థలో నిన్న భారీ అగ్నిప్రమాదం
  • ఐదుగురు కార్మికుల మృతి
  • సీరం సీఈవోతో కలిసి మీడియాతో మాట్లాడిన ఉద్ధవ్
  • రూ.1000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందన్న పూనావాలా
పూణేలోని సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఘోర అగ్నిప్రమాదం జరిగి ఐదుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించినట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వెల్లడించారు. సీరం సంస్థ అధినేత అదార్ పూనావాలతో కలిసి ఉద్ధవ్ ఈ రోజు మీడియాతో మాట్లాడారు.

సీరం ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక దీనివెనుక కుట్ర ఏదైనా ఉందా? అనే విషయం దర్యాప్తులో తేలుతుందని అన్నారు. సీరం కంపెనీ సీఈవో అదార్ పూనావాలా మాట్లాడుతూ, అగ్నిప్రమాదం కారణంగా రూ.1000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని తెలిపారు. అయితే, కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం లేదని, కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతోంది ఇక్కడ కాదని వెల్లడించారు.
Udhav Thackeray
Adar Poonawala
SII
Fire Accident
Pune
Maharashtra

More Telugu News