Sasikala: స్పృహలోనే ఉన్న శశికళ... తాజా బులెటిన్ వెల్లడి

  • అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళ
  • సుప్రీం ఆదేశాలతో ముందే విడుదల కానున్న వైనం
  • కరోనా పాజిటివ్ రావడంతో ఆసుపత్రి పాలు
  • ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూలో చికిత్స
Sasikala latest health bulletin

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలిగా పేరుగాంచిన శశికళ (66) ఆరోగ్యం క్షీణించడంతో బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనాకు తోడు డయాబెటిస్, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. శశికళ ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నట్టు తెలిసింది.

తాజాగా ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు బులెటిన్ విడుదల చేశాయి. శశికళ స్పృహలోనే ఉన్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని వెల్లడించాయి. నాడి, బీపీ, శ్వాస రేటు, ఇతర అంశాలను కూడా బులెటిన్ లో పంచుకున్నారు.

అక్రమాస్తుల కేసులో శశికళ గత నాలుగేళ్లుగా బెంగళూరు పరప్పణ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూ.10 కోట్లు జరిమానా చెల్లించి ముందే విడుదల కానున్నారు. తమిళనాట అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చిన్నమ్మ విడుదల రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపుతుందని భావించారు. అయితే ఆనూహ్యరీతిలో ఆమె అనారోగ్యం పాలయ్యారు.

More Telugu News