టీమిండియాను ఆకాశానికెత్తేసిన పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్

22-01-2021 Fri 18:57
  • ఆసీస్ ను సొంత గడ్డపై ఓడించడం అద్భుతం
  • కీలక ఆటగాళ్లు లేకపోయిన కుర్రాళ్లు గొప్పగా ఆడారు
  • యువ ఆటగాళ్ల వెనుక ద్రావిడ్ ఉన్నాడు
Inzamam praises Team India young players

ఆస్ట్రేలియాను సొంత గడ్డపైనే మట్టికరిపించి టెస్టు సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా యువ జట్టుపై ప్రశంసల జల్లు కరుస్తోంది. ఆసీస్ ను సొంత గడ్డపై ఓడించడం అద్భుతమని, ఇలాంటి జట్టును తాను ఎప్పుడూ చూడలేదని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ కొనియాడాడు. టీమిండియా చరిత్రలోనే ఇదొక అద్భుత విజయమని అన్నారు. టెస్టుల్లో అనుభవం లేని ఆటగాళ్లు ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపైనే ఓడించడం అద్భుతమని చెప్పాడు. సిరీస్ లో రాణించిన సిరాజ్, శుభ్ మన్ గిల్, రిషభ్ పంత్ వంటివారెవరికీ పెద్దగా అనుభవం లేదని అన్నాడు. పైగా టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో 330 పరుగులు చేయడం మామూలు విషయం కాదని చెప్పాడు.

కోహ్లీ, అశ్విన్, జడేజా, బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు లేకపోయినా కుర్రాళ్లు అద్భుతంగా ఆడారని ఇంజమామ్ అన్నాడు. ఈ యువ ఆటగాళ్ల వెనుక భారత దిగ్గజం ద్రావిడ్ ఉన్నాడని చెప్పాడు. అండర్ 19 కోచ్ ద్రావిడ్ సమక్షంలో వీరంతా రాటుదేలారని తెలిపాడు. ఇండియా తరపున ఆడేటప్పుడు ద్రావిడ్ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడేవాడని చెప్పాడు.