రంజన్ గొగోయ్ కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత

22-01-2021 Fri 17:25
  • సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత
  • ఇప్పటి వరకు రక్షణ బాధ్యతను చూసుకున్న ఢిల్లీ పోలీసులు
  • ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న గొగోయ్
Former CJI Ranjan Gogoi security rises to Z plus category

సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ కు కేంద్ర ప్రభుత్వం జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించింది. సీఆర్పీఎఫ్ బలగాలతో గొగోయ్ కు భద్రతను కల్పించనున్నట్టు కేంద్రం ఉత్తర్వులను జారీ చేసింది. దేశంలో ఆయన ఎక్కడ పర్యటించినా ఈ భద్రత ఉంటుందని తెలిపింది. ఇప్పటి వరకు ఆయన రక్షణ బాధ్యతలను ఢిల్లీ పోలీసు వ్యవస్థ చూసుకునేది. సీజేఐగా ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత ఆయనను రాజ్యసభకు నామినేట్ చేశారు. తాను సీజేఐగా ఉన్న సమయంలో అయోధ్య రామ జన్మభూమి కేసుతో పలు కీలక కేసులకు గొగోయ్ ముగింపు పలికారు.