Pawan Kalyan: అయోధ్య రామమందిరం నిర్మాణానికి రూ.30 లక్షల విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan donates huge amount for Ayodhya Ram Mandir
  • తిరుపతిలో జనసేన రాజకీయ కమిటీ సమావేశం
  • పవన్ మీడియా సమావేశం
  • భారీ విరాళం ఇస్తున్నట్టు వెల్లడి
  • రాముడి ప్రాశస్త్యాన్ని వివరించిన వైనం
జనసేనాని పవన్ కల్యాణ్ అయోధ్య రామమందిరం నిర్మాణానికి రూ.30 లక్షల విరాళం ప్రకటించారు. తిరుపతిలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కోసం వచ్చిన జనసేనాని ఇవాళ నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు. అంతేకాకుండా, తన కార్యవర్గంలో ఉన్న ఇతర మతాలకు చెందినవారు కూడా రూ.11 వేలు అందించారని, దాని తాలూకు డీడీని కూడా అందిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాముడి ప్రాశస్త్యాన్ని వివరించారు.

ఓ మహాపండితుడు రామో విగ్రహవాన్ ధర్మః అన్నారని, రాముడు ధర్మానికి ప్రతిరూపం అనేది దానర్థం అని తెలిపారు. రాముడు సహనం, శాంతి, శౌర్యం వంటి గుణాలను ప్రదర్శించాడని, ఈ దేశం అనేక దాడులు, అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా బలంగా నిలబడిందంటే అందుకు కారణం రాముడు చూపిన మార్గమేనని పవన్ ఉద్ఘాటించారు. అన్ని వర్గాలను ఆమోదించే విధంగా భారతదేశం ఉందంటే అది రాముడి చలవేనని అన్నారు. అందుకే రామరాజ్యం అంటామని వివరించారు.
Pawan Kalyan
Donation
Ayodhya Ram Mandir
Janasena

More Telugu News