ఎస్వీబీసీ ట్రస్టుకు కోటి రూపాయలు విరాళం అందించిన శాంతా బయోటెక్ చైర్మన్

22-01-2021 Fri 14:11
  • శ్రీవారి దర్శనానికి వచ్చిన శాంతా బయోటెక్ అధిపతి
  • సతీసమేతంగా స్వామివారి దర్శనం
  • ఆలయ సన్నిధిలో డీడీ అందజేత
  • విరాళం అందుకున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
Santa Biotech chairman Varaprasad Reddy donates one crore rupees towards SVBS trust

దేశంలో ఉన్న ప్రముఖ ఫార్మా పరిశోధన సంస్థలో శాంతా బయోటెక్ ఒకటి. మానవాళికి ప్రమాదకరంగా పరిణమించిన హెపటైటిస్-బి వ్యాధికి వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా టీకాలను తీసుకువచ్చింది శాంతా బయోటెక్ ఫార్మా సంస్థే. ఈ సంస్థకు అధిపతి తెలుగువాడైన కేఈ వరప్రసాద్ రెడ్డి. ఆయన తాజాగా శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) ట్రస్టుకు భారీ విరాళం ప్రకటించారు. ఆ మేరకు కోటి రూపాయల డీడీని ఆయన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందించారు. శ్రీవారి దర్శనానికి సతీసమేతంగా వచ్చిన శాంతా బయోటెక్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి శ్రీవారి సన్నిధిలో డీడీని అందజేశారు.