నేను ప్రేమించిన అమ్మాయి ఈ రోజే జన్మించింది: మ‌హేశ్ బాబు

22-01-2021 Fri 13:28
  • లేడీ బాస్ అంటూ త‌న భార్య‌కు  పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు
  • న‌మ్ర‌త‌తో దిగిన‌ ఫొటోను పోస్ట్ చేసిన మ‌హేశ్
  • ఆమెతో ఉన్న ప్రతిరోజూ ప్రత్యేకమేన‌ని వ్యాఖ్య
mahesh wishes namrata

త‌న భార్య న‌మ్ర‌తా శిరోద్కర్ కు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపాడు. ఆమెతో దిగిన ఓ ఫొటోను నమ్రత జన్మదినోత్సవం సంద‌ర్భంగా మ‌హేశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. తాను ప్రేమించిన వ్యక్తి ఈ రోజు జన్మించింద‌ని, ఆమెతో ఉన్న ప్రతిరోజూ ప్రత్యేకమేన‌ని అన్నాడు.

అయితే,  ఈ రోజు మరి కాస్త ఎక్కువని చెప్పుకొచ్చాడు. లేడీ బాస్ కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అని మహేశ్ చెప్పాడు. కాగా, ఆమె బర్త్ డే వేడుక‌ను తన కుటుంబంతో కలిసి ఆయ‌న‌ దుబాయ్‌లో జ‌రుపుకుంటున్నాడు. 'స‌రిలేరు నీకెవ్వ‌రు' సూప‌ర్ హిట్ త‌ర్వాత ప్ర‌స్తుతం ఆయ‌న 'స‌ర్కారు వారి పాట' సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.