ప్రభుదేవా, కాజల్ జంటగా రొమాంటిక్ కామెడీ సినిమా!

22-01-2021 Fri 11:59
  • ఇటీవలే పెళ్లి చేసుకున్న కాజల్
  • పెళ్లయి నా తగ్గని కాజల్ దూకుడు
  • 'ఆచార్య' సినిమాలో చిరుకి జంటగా 
Kajal Aggarwal to pair with Prabhu Deva

తెలుగు సినీ పరిశ్రమలో చందమామగా, పంచదార బొమ్మగా ప్రేక్షకుల చేత పిలిపించుకుంటున్న కాజల్ అగర్వాల్ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాలకు ఓకే చెపుతూ తన కెరీర్ ను కొనసాగిస్తోంది. దర్శకులు, నిర్మాతలు కూడా ఆమెకు ఆఫర్లు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు.

తాజాగా కాజల్ కు సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. ప్రభుదేవాతో కలిసి కాజల్ ఓ తమిళ సినిమా చేయబోతోందనేదే ఆ వార్త. కల్యాణ్ డైరెక్షన్ లో ఈ చిత్రం తెరకెక్కబోతోందని... ఇది రొమాంటిక్ కామెడీ సినిమా అని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.

మరోవైపు చిరంజీవి తాజా చిత్రం 'ఆచార్య' సినిమాలో కూడా కాజల్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.