శ్రీవారిని ద‌ర్శించుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఫొటోలు ఇవిగో

22-01-2021 Fri 11:15
  • తీర్థ, ప్రసాదాలను అందజేసిన అర్చ‌కులు
  • ప‌వ‌న్ వెంట‌ జ‌న‌సేన నేత‌ నాదెండ్ల
  • కాసేప‌ట్లో మీడియా స‌మావేశం
pawan to conduct press meet

తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌లో ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు ఉద‌యం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు అర్చ‌కులు తీర్థ, ప్రసాదాలను అందజేశారు. అంత‌కు ముందు ఆయ‌న‌కు టీటీడీ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆయ‌న వెంట జ‌న‌సేన నేత‌ నాదెండ్ల మనోహర్‌తో పాటు మరి కొందరు స్థానిక‌ నేతలు కూడా ఉన్నారు. వెంక‌టేశ్వ‌రుడిని దర్శించుకున్న అనంతరం తిరిగి తిరుపతికి బయలుదేరారు.
     
తిరుపతిలో ప‌వ‌న్ క‌ల్యాణ్ మీడియా స‌మావేశంలో పాల్గొన‌నున్నారు. లోక్‌సభ ఉప ఎన్నికలో జనసేన తరఫున అభ్యర్థిని పోటీ చేయిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోన్న నేప‌థ్యంలో ఆయ‌న పెడుతోన్న మీడియా స‌మావేశంపై ఆస‌క్తి నెల‌కొంది. ఆ స్థానం నుంచి పోటీ చేసే అంశంపై ఆయ‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.   లోక్‌సభ ఉప ఎన్నిక బరిలో జనసేన నిలిస్తే తాను అక్క‌డి అన్ని ప్రాంతాల్లోనూ పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తానని పవన్ కల్యాణ్  ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.