మ‌రికాస్త పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు

22-01-2021 Fri 10:48
  • న్యూఢిల్లీలో లీట‌రు పెట్రోల్ రూ.85.45, డీజిల్‌ ధర రూ.75.63
  • హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.88.89, డీజిల్ రూ.82.53
  • విజయవాడలో పెట్రోల్ రూ.91.33, డీజిల్ రూ.85.08
Petrol Diesel Price in Hyderabad

దేశంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు మ‌రింత పెరిగాయి. పెట్రోల్, డీజిల్‌ పై న్యూఢిల్లీలో లీట‌రుకి 25 పైసల చొప్పున ధ‌ర పెర‌గ‌డంతో పెట్రోల్ రూ.85.45, డీజిల్‌ ధర రూ. 75.63కు చేరింది. హైదరాబాద్‌లో లీట‌రు పెట్రోల్ రూ.88.89, డీజిల్ రూ.82.53, విజయవాడలో పెట్రోల్ రూ.91.33, డీజిల్ రూ.85.08గా ఉన్నాయి.  

జైపూర్ లో అత్య‌ధికంగా లీట‌రు పెట్రోల్‌ రూ.93.06, డీజిల్‌ రూ.85.08గా ఉన్నాయి. ఆ త‌ర్వాత‌ ముంబైలో లీట‌రు పెట్రోల్ ధర రూ.92.04, డీజిల్ ధర రూ.82.40గా ఉంది. కోల్‌కతాలో లీట‌రు పెట్రోల్ రూ.86.87, డీజిల్ రూ79.23, చెన్నైలో లీట‌రు పెట్రోల్ రూ.88.07, డీజిల్ రూ.80.90, బెంగళూరులో పెట్రోల్ రూ.88.33, డీజిల్ రూ.80.20గా ఉన్నాయి.