సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. మొత్తం ఖాళీలు 372

22-01-2021 Fri 09:11
  • మొత్తం పోస్టులు 651
  • తొలి విడతలో సగం పోస్టులు మాత్రమే భర్తీ
  • ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ అభ్యర్థులకు 305 పోస్టుల కేటాయింపు
SCCL Issues Notification for 372 Posts

సింగరేణి సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 651 ఖాళీలను భర్తీ  చేయాల్సి ఉండగా తొలి విడతలో 372 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో 128 ఫిట్టర్, 51 ఎలక్ట్రీషియన్, 54 వెల్డర్, 22 టర్నర్/మెషినిస్ట్, 14 మోటారు మెకానిక్, 19 ఫౌండ్రీమెన్/మౌల్డర్, 84 జూనియర్ స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేయనున్నారు.

స్థానిక రిజర్వేషన్ కింద 305 పోస్టులను ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ అభ్యర్థులకు కేటాయించారు. మిగిలిన పోస్టుల కోసం తెలంగాణ అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక స్థానిక రిజర్వేషన్ కింద భర్తీ చేసే వాటిలో 105 ఫిట్టర్, 43 ఎలక్ట్రీషియన్, 44 వెల్డర్, 18 టర్నర్/మెషినిస్ట్, 16 ఫౌండ్రీమెన్/మౌల్డర్, 67 స్టాఫ్ నర్స్, 12 మోటార్ మెకానిక్ పోస్టులు ఉన్నాయి.  నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి  వెబ్‌సైట్ (www.scclmines.com) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి గడువు వచ్చే నెల 4. ఆన్‌లైన్ దరఖాస్తులకు సంబంధించిన హార్డ్‌కాపీని మాత్రం సింగరేణి ప్రధాన కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది.