భారత్ తో తొలి రెండు టెస్టులకు ఇంగ్లాండ్ జట్టు ఎంపిక
- ఫిబ్రవరి 5 నుంచి భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్
- టీమిండియాతో నాలుగు టెస్టులు ఆడనున్న ఇంగ్లాండ్
- జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ పునరామగనం
- బెయిర్ స్టో, శామ్ కరన్ లకు విశ్రాంతి
అలాగే, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్, ఓపెనర్ రోరీ బర్న్ కూడా జట్టులోకి వచ్చారు. బెయిర్ స్టో, శామ్ కరన్, మార్క్ వుడ్ లకు టీమిండియాతో తొలి రెండు టెస్టులకు విశ్రాంతినిచ్చారు. ఫిట్ నెస్ నిరూపించుకుంటే ఓల్లీ పోప్ ఇంగ్లాండ్ జట్టుతో కలుస్తాడు. ఫిబ్రవరి 5 నుంచి భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
తొలి రెండు టెస్టులకు ఇంగ్లాండ్ జట్టు ఇదే...
జో రూట్ (కెప్టెన్), రోరీ బర్న్స్, డామ్ సిబ్లే, జాక్ క్రాలే, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, ఓల్లీ స్టోన్, బెన్ ఫోక్స్, డాన్ లారెన్స్, స్టూవర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, డామ్ బెస్, క్రిస్ వోక్స్, జేమ్స్ ఆండర్సన్, జోఫ్రా ఆర్చర్.
రిజర్వ్ ఆటగాళ్లు...
జేమ్స్ బ్రేసీ, మాసన్ క్రేన్, సకిబ్ మహమూద్, మాట్ పార్కిన్సన్, ఓల్లీ రాబిన్సన్, అమర్ వర్దీ.