ఏపీ కరోనా అప్ డేట్: కొత్తగా 139 మందికి పాజిటివ్

21-01-2021 Thu 16:57
  • గత 24 గంటల్లో 49,483 టెస్టులు
  • అత్యధికంగా కృష్ణా జిల్లాలో 35 మందికి పాజిటివ్
  • అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 3 కేసులు
  • యాక్టివ్ కేసుల సంఖ్య 1,522
AP Corona Update

ఏపీలో గడచిన 24 గంటల్లో కరోనాతో ఒక్క మరణం కూడా సంభవించకపోగా, కొత్తగా 139 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. 49,483 కరోనా పరీక్షలు నిర్వహించగా అత్యధికంగా కృష్ణా జిల్లాలో 35 కొత్త కేసులు వెల్లడయ్యాయి. చిత్తూరు జిల్లాలో 20, గుంటూరు జిల్లాలో 17 కేసులు గుర్తించారు. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 3, కడప జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో 5, విజయనగరం జిల్లాలో 5 కేసులు గుర్తించారు. అదే సమయంలో 254 మంది వైరస్ ప్రభావం నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 8,86,557 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,77,893 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,522 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,142 కరోనా మరణాలు నమోదయ్యాయి.