ఎయిర్ పోర్టులో సింగర్ హరిహరన్ మెడలోని డైమండ్ నెక్లెస్ మాయం

21-01-2021 Thu 16:18
  • రాజస్థాన్ పర్యటనకు వెళ్లిన గాయకుడు హరిహరన్  
  • సెక్యూరిటీ చెకింగ్ సమయంలో నెక్లేస్ మాయమైనట్టు గుర్తించిన హరిహరన్
  • జవహర్ సర్కిల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పోలీసులు
Singer Hariharan lost his diamond necklace

ప్రముఖ సినీ గాయకుడు హరిహరన్ కు చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్ పర్యటనకు వెళ్లిన ఆయన... పర్యటనను ముగించుకుని ముంబై తిరిగి వెళ్లేందుకు జైపూర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే, ఎయిర్ పోర్టులో ఆయన మెడలో ఉన్న డైమండ్ నెక్లెస్ మాయమైంది.

ఎయిర్ పోర్టులో సెక్యూరిటీ చెకింగ్ సమయంలో తన మెడలోని నెక్లెస్ మాయమైనట్టు ఆయన గుర్తించారు. వెంటనే అక్కడ ఆయన వెతికినప్పటికీ అది దొరకలేదు. దీంతో తన మేనేజర్ చేతన్ గుప్తాతో కలిసి జవహర్ సర్కిల్ పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు.