Varla Ramaiah: పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేవరకు ఈ డీజీపీని తొలగించాలని ఎస్ఈసీని కోరుతున్నాం: వర్ల రామయ్య

  • సవాంగ్ ఉంటే స్థానిక ఎన్నికలు సజావుగా జరగవన్న వర్ల
  • నిష్పాక్షికంగా వ్యవహరించే వ్యక్తిని డీజీపీగా నియమించాలని విజ్ఞప్తి
  • సవాంగ్ టీడీపీ పట్ల వ్యతిరేక ధోరణితో ఉన్నారన్న రామయ్య 
  • డీజీపీ పదవి ఇవ్వలేదని టీడీపీ పట్ల మరోలా వ్యవహరిస్తున్నారని ఆరోపణ
Varla Ramaiah fires on AP DGP Gautam Sawang

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు, టీడీపీ నేతలకు మధ్య కొంతకాలంగా వాడీవేడి వాతావరణం నెలకొంది. ఇటీవల విగ్రహాల ధ్వంసం ఘటనల నేపథ్యంలో మరింత అగ్గి రాజుకుంది. ఈ క్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్రంగా స్పందించారు. పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేవరకు ఈ డీజీపీ వద్దని ఎస్ఈసీని కోరుతున్నామని తెలిపారు.

రాష్ట్ర డీజీపీగా గౌతమ్ సవాంగ్ ఉంటే పంచాయతీ ఎన్నికలు సజావుగా జరగవని అన్నారు. స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు సవాంగ్ ను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. సమర్థుడు, నిష్పక్షపాతంగా వ్యవహరించే వ్యక్తిని డీజీపీగా నియమించాలని సూచించారు. డీజీపీ సవాంగ్ టీడీపీ పట్ల వ్యతిరేక ధోరణితో ఉన్నారని వర్ల రామయ్య తెలిపారు. అప్పట్లో తాము డీజీపీ పదవి ఇవ్వలేదనే టీడీపీతో మరోలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

More Telugu News