తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ కు శుభాకాంక్షలు: డిప్యూటీ స్పీకర్ పద్మారావు

21-01-2021 Thu 15:06
  • కేటీఆర్ సీఎం కాబోతున్నారంటూ జోరుగా ప్రచారం
  • ఈ వార్తలపై మరింత స్పష్టతనిచ్చిన పద్మారావు
  • త్వరలోనే సీఎం కాబోతున్నారని వ్యాఖ్య
KTR will become CM soon says Padmarao

కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ కు త్వరలో ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పగించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించిన ముహూర్తం కూడా ఖరారైందని అంటున్నారు. ఇప్పటికే ఈ దిశగా పలువురు టీఆర్ఎస్ నేతలు కూడా సంకేతాలు ఇచ్చారు. తాజాగా శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పట్టాభిషేకంపై మరింత క్లారిటీ ఇచ్చారు.

త్వరలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని పద్మారావు అన్నారు. కాబోయే సీఎంకు శాసనసభ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పారు. సికింద్రాబాద్ లో కొత్తగా నిర్మించిన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘం డివిజనల్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.