జిమ్‌లో చెమటోడుస్తున్న మ‌హేశ్ బాబు.. వీడియో ఇదిగో

21-01-2021 Thu 13:27
  • వ‌రుస హిట్ల‌తో జోరు మీదున్న‌ టాలీవుడ్ ‌ మహేశ్
  • ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాటలో న‌టిస్తోన్న సూప‌ర్ స్టార్
  • జిమ్ లో ఆయ‌న వ్యాయామం చేస్తోన్న తీరుపై అభిమానుల ప్ర‌శంస‌లు
mahesh fitness secret

వ‌రుస హిట్ల‌తో జోరు మీదున్న‌ టాలీవుడ్ హీరో‌ మహేశ్‌‌ బాబు తాజాగా జిమ్ లో వ్యాయామం చేస్తూ వీడియో తీసుకున్నాడు. దీన్ని త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆయన ఫిట్‌నెస్ ర‌హ‌స్యం ఇదేనంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మ‌హేశ్ బాబు ‘బాక్స్ జంప్స్’ చేస్తూ జిమ్ లో వ్యాయామం చేస్తోన్న తీరు ప‌ట్ల ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

స‌రిలేరు నీకెవ్వ‌రు వంటి సూప‌ర్ హిట్ సినిమా త‌ర్వాత మహేశ్‌‌ బాబు.. పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాలో న‌టిస్తున్నాడు. ఇందులో మ‌హేశ్‌ స‌ర‌స‌న కీర్తి సురేష్ న‌టిస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్, ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, మ‌హేశ్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయ‌న హెయిర్ స్టైల్ మార్చాడు.