America: బాధ్యతలు చేపట్టిన వెంటనే బైడెన్ సంతకం చేసిన ఆదేశాలు ఇవే!

  • 15 కీలక ఆదేశాలపై సంతకం చేసిన బైడెన్
  • కరోనాకు అడ్డుకట్ట వేసే చర్యలు..
  • ప్రపంచ ఆరోగ్య సంస్థలో మళ్లీ భాగస్వామ్యం
  • మెక్సికో గోడ నిర్మాణం నిలుపుదల
joe biden signs on 15 important bills

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జో బైడెన్ 15 కీలక ఆదేశాలపై సంతకాలు చేశారు.  ఇందులో మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన పలు ఆదేశాలను వెనక్కి తీసుకున్న ఉత్తర్వులు కూడా ఉన్నాయి. బైడెన్ సంతకం చేసిన ఆదేశాలలో.. కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా ప్రతి ఒకరు వంద రోజులపాటు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడంతో పాటు, అధ్యక్షుడికి కరోనాపై అప్ డేట్స్ నివేదించే 'కొవిడ్-19 రెస్పాన్స్ కో ఆర్డినేటర్' పోస్టు నియామకం కూడా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి అమెరికా వైదొలుగుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేశారు.

డబ్ల్యూహెచ్ఓ సమావేశాలకు ఇక నుంచి సాంక్రమిక వ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌసీ బృందం ప్రాతినిధ్యం వహించనుంది. వీటితోపాటు పారిస్ వాతావరణ ఒప్పందంలో ఆమెరికాను మళ్లీ భాగస్వామిని చేయడం, ముస్లిం దేశాలకు రాకపోకలపై ట్రంప్ విధించిన నిషేధాన్ని ఎత్తివేయడం, మెక్సికో గోడ నిర్మాణాన్ని నిలిపివేయడం, దేశాభివృద్ధిలో భాగస్వామ్యమైన వారికి శాశ్వత నివాసం/పౌరసత్వ కల్పన వంటి ఉత్తర్వులు ఉన్నాయి.

More Telugu News