YV Subba Reddy: మంచి పనులు చేస్తున్న జగన్ పై కుట్రలు చేస్తున్నారు: వైవీ సుబ్బారెడ్డి

Opposition parties are plotting conspiracy on Jagan says YV Subba Reddy
  • కుట్రలో భాగంగానే దేవాలయాలపై దాడులు
  • విగ్రహాల ధ్వంసం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు
  • దేవుళ్లపై దాడులు చేస్తే దేవుళ్లే శిక్షిస్తారు
ప్రజలకు మంచి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ పై కొన్ని పార్టీల వారు కుట్రలు చేస్తున్నారని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఇందులో భాగంగానే హిందూ దేవాలయాలపై దాడులు చేయిస్తున్నారని అన్నారు. మంచి కార్యక్రమాలపై బురద చల్లేందుకు విగ్రహాల ధ్వంసం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేవుళ్లపై దాడులు చేస్తే దేవుళ్లే శిక్షిస్తారని అన్నారు.

శేషాచలం అడవుల్లో జంతువుల సంచారం సర్వసాధారణమని... తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి హాని జరగకుండా రక్షణ చర్యలను చేపడుతున్నామని చెప్పారు. రాజమండ్రి రూరల్ బొమ్మూరులో దాదాపు 6 వేల ఇళ్ల పట్టాలను సుబ్బారెడ్డి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
YV Subba Reddy
YSRCP
Jagan

More Telugu News