చిరంజీవి 153వ చిత్రం షూటింగ్ ప్రారంభం

20-01-2021 Wed 18:12
  • సూపర్ గుడ్ మూవీస్ కార్యాలయంలో భూమి పూజ
  • దర్శకత్వం వహిస్తున్న మోహన్ రాజా
  • అభిమానులు కోరుకునే విధంగా సినిమా ఉంటుందన్న మోహన్ రాజా
Megastar Chiru new film kickstarted with a Pooja today

మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. చిరంజీవి సతీమణి సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. మలయాళ హిట్ సినిమా 'లూసిఫర్' రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.

హైదరాబాద్ ఫిలింనగర్ లో ఉన్న సూపర్ గుడ్ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కొణిదెల నాగబాబు, అల్లు అరవింద్, అశ్వనీదత్, కొరటాల శివ, జెమినీ కిరణ్, ఠాగూర్ మధు, మెహర్ రమేశ్, రామ్ ఆచంట, గోపి ఆచంట తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ, చిరంజీవితో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. అభిమానులు కోరుకునే విధంగా ఈ సినిమా ఉంటుందని తెలిపారు. మెగాస్టార్ కెరీర్ లో ఇది విభిన్నమైన సినిమా అవుతుందని చెప్పారు. పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. నిర్మాతలు ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ చిరంజీవి కెరీర్ లో ఇది బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పారు.