అమరావతి ఎస్సీ రైతులపై పెట్టిన అట్రాసిటీ సెక్షన్లను కొట్టేసిన హైకోర్టు

20-01-2021 Wed 17:44
  • 11 మంది ఎస్సీ రైతులపై అట్రాసిటీ కేసులు
  • హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన ఎస్సీ రైతులు
  • రైతుల తరపున వాదనలు వినిపించిన లాయర్ ఇంద్రనీల్
AP High Court orders to remove atrocity sections on Amaravathi SC farmers

అమరావతి ప్రాంతంలోని కృష్ణాయపాలెం రైతులపై పెట్టిన అట్రాసిటీ సెక్షన్లను ఈరోజు ఏపీ హైకోర్టు  కొట్టేసింది. తమపై పెట్టిన అట్రాసిటీ సెక్షన్లను ఎత్తేయాలని ఎస్సీ రైతులు క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఎస్సీ సెక్షన్లను కొట్టేస్తూ తీర్పును వెలువరించింది. రైతుల తరపున లాయర్ ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించారు. కృష్ణాయపాలెంలోని 11 మంది రైతులపై ఈ కేసులను పెట్టారు. హైకోర్టు తీర్పుపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.