sensex: మార్కెట్లకు నేడూ లాభాలే... 50 వేలకు చేరువలో సెన్సెక్స్!

  • 394 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 124 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • లాభాల్లో పయనించిన ఆసియా మార్కెట్లు
Sensex reaches to 50K mark

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించబోతున్నట్టు కాబోయే అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ యెల్లెన్ చేసిన ప్రకటనతో ఆసియా మార్కెట్లన్నీ లాభాల్లో కొనసాగాయి. సెన్సెక్స్ 50 వేల మార్కుకు చేరువలోకి వచ్చింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 394 పాయింట్లు పెరిగి 49,792కి చేరుకుంది. నిఫ్టీ124 పాయింట్లు ఎగబాకి 14,645 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ లో విప్రో, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ తదితర షేర్లు లాభాలను గడించాయి. ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గెయిల్, శ్రీ సిమెంట్స్ తదితర షేర్లు నష్టపోయాయి. మరోవైపు డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 73.02 వద్ద ముగిసింది.

More Telugu News