బ్రదర్ అనిల్ కుమార్ తో పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తికున్న అనుబంధాన్ని బహిర్గతం చేయాలి: వర్ల రామయ్య

20-01-2021 Wed 13:46
  • ప్రవీణ్ ఇంట్లో దొరికిన సాక్ష్యాలను బయటపెట్టాలి
  • సజ్జల ముందుకు వెళ్తే సాక్ష్యాలు తారుమారవుతాయి
  • ప్రవీణ్ కు ఉన్న రాజకీయ సంబంధాలను బయటపెట్టాలి
Varla Ramaiah demads to expose Paster Praveen Chakravarthi relation with Brother Anil Kumar

ఏపీలోని ఆలయాలపై తానే దాడులకు పాల్పడ్డానంటూ పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి ఇంటిలో సీఐడీ సేకరించిన సాక్ష్యాలను వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

ఆ ఆధారాలు సజ్జల రామకృష్ణారెడ్డి ముందుకు వెళ్తే తారుమారవుతాయని అన్నారు. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ కేసులో తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని వ్యాఖ్యానించారు. ప్రవీణ్ కున్న రాజకీయ సంబంధాలను  తేల్చాలని అన్నారు. బ్రదర్ అనిల్ కుమార్ తో ఉన్న అనుబంధాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.