రాజస్థాన్ లోని టోల్ ప్లాజా వ‌ద్ద ఎంపీ అనుచ‌రుల వీరంగం.. వీడియో ఇదిగో

20-01-2021 Wed 13:35
  • షాజ‌హాన్‌పూర్ టోల్‌ప్లాజా వ‌ద్ద ఘ‌ట‌న‌
  • సీసీటీవీ కెమెరాల్లో రికార్డు
  • కారు ఆపినందుకు టోల్ ప్లాజాపై దాడికి పాల్ప‌డ్డ వైనం
ruckus at toll plaza in rajastan

టోల్ ప్లాజా మీదుగా వెళ్తున్న ఓ ఎంపీ అనుచ‌రులు టోల్ ఫీజును చెల్లించ‌క‌పోవ‌డ‌మే కాకుండా అక్క‌డ‌నున్న సిబ్బందిని తిడుతూ హ‌ల్‌చ‌ల్ చేశారు. అక్క‌డి ప‌లు వ‌స్తువుల‌ను ధ్వంసం చేస్తూ రెచ్చిపోయారు. రాజ‌స్థాన్‌లోని షాజ‌హాన్‌పూర్ టోల్‌ప్లాజాలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

 ఎంపీ అనుచ‌రుల వీరంగం అక్క‌డి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీకి చెందిన ఎంపీ హ‌నుమాన్ బేనివాల్ త‌న అనుచ‌రుల‌తో కార్ల‌లో వెళ్తుండగా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. టోల్ ప్లాజా వ‌ద్ద‌ ఎంపీ హ‌నుమాన్ బేనివాల్ కారుకి దారి ఇచ్చిన అనంత‌రం ఆ కారు వెనుక ఉన్న ఇతర కార్ల‌ను టోల్ ప్లాజా సిబ్బంది ఫీజు అడ‌గ‌డంతో ఎంపీ అనుచరులు ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డారు. దీంతో ఎంపీ అనుచ‌రులు అక్క‌డ విధ్వంసానికి పాల్ప‌డి వెళ్లిపోయారు.